టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటారు. చిరంజీవి తన కెరీర్ను ఎన్నో సంవత్సరాల క్రితం మొదలు పెట్టి ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఆఖరుగా భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే చిరంజీవి చాలా కాలం క్రితమే మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ కి భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ సినిమా పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. అలాగే శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి చిరంజీవి కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇలా ఒక మూవీ ని సెట్స్ పై ఉంచి మరో రెండు మూవీలకి కమిట్ అయి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవితో సినిమా చేయడానికి ఓ యంగ్ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న బాబి , చిరంజీవి కోసం ప్రస్తుతం ఓ కథను రెడీ చేస్తున్నట్లు , అది అద్భుతంగా వచ్చింది అనుకుంటే చిరంజీవి కి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: