డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి .. వాటిలో హరిహర వీరమల్లు ఓజి ఉస్తాద్ భగత్ సింగ్ .. ఇక హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది .. కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్లో ఉంది అందుకే మార్చ్ 29 రావాల్సిన ఈ సినిమా మే 9 కి వాయిదా వేశారు .. అయాన కూడా ఈ సమ్మర్ కి పెద్ద సినిమాలు లేవు కాబట్టి .. ఆ లోటు ఈ సినిమాతో తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి .
 

అయితే దీనికంటే ముందే ఓజీ సినిమాకి సంబంధించిన తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్ .. దానికి సంబంధించి కూడా నాలుగైదు క్లోజ్ ఆఫ్ షాట్స్ కావాలి. సో రెండు రోజులు కాల్ షీట్స్ ఇస్తే ఓజి పని కూడా కంప్లీట్ అవుతుం ది.. పవర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు .  అయితే ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ నెల చివర్లో రిలీజ్ చేయాలని నిర్మాత డివివి దానయ్య భావిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్‌ వినిపిస్తుంది .

 

ఓజీ పాన్ ఇండియా మూవీ .. అలాంటి సినిమాకి సెప్టెంబర్ ఎండింగ్ మంచి సమయం .. అయితే ఇప్పటికే సెప్టెంబర్ 25కి సాయిధరమ్ తేజ్ సంబరాల యేటి గట్టు రిలీజ్ కి రాబోతుంది .. అలాగే బాలకృష్ణ అఖండ 2 కూడా సెప్టెంబర్ 25న రానుంది .. సాయిధరమ్ తేజ్ తన మావయ్య సినిమా వస్తుందంటే కచ్చితంగా సినిమాను వాయిదా వేసుకుంటాడు . అయితే అఖండ 2 అలా కాదు .. బోయపాటి , బాలయ్య కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. అఖండ 2 కూడా పాన్ ఇండియా సినిమా .. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు .. ఈ సినిమాని వాయిదా వేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపించకపోవచ్చు .. ఒకవేళ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడితే బిగ్ ఫైట్ తప్పదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: