ప్రజెంట్ మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసిన హీరోలు ఎవ‌రెంటే ప్రభాస్ , అల్లు అర్జున్ ముందు వరుసలో ఉన్నారు .. ప్రభాస్ బాహుబలి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కే బాద్షాగా మారాడు .. ఆ తర్వాత వరస పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా దగ్గర తిరుగులేని హీరోగా నిలిచాడు .. అలాగే ప్రభాస్ చేసిన సలార్ , కల్కి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ప్రభాస్ క్రేజ్‌ను మరో లెవల్ కు తీసుకువెళ్లాయి ..


అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాల తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశాడు .. ప్రధానంగా పుష్ప2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్ సాధించి నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు .. ఈ ఇద్దరు హీరోలు చేసే సినిమాలు కూడా అన్ని పాన్ ఇండియ లెవ‌ల్‌లోనే  వస్తున్నాయి .. అయితే ఈ ఇద్దరి పాన్ ఇండియా హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి అనే విషయం చాలా మందికి తెలియదు .. కానీ ఇది నిజం .. ఈ విషయం తెలియాలంటే మనం 22 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి . అంటే 2003 లోకి అన్నమాట .. ఆ సంవత్సరం అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని అల్లు అరవింద్ , అశ్విని దత్ కలిసి నిర్మించారు ..


మార్చ్ 28న ఈ సినిమా రిలీజ్ అయింది .. మొదటి రోజు ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ కావడం థియేటర్ల గంగోత్రి నుంచి తెచ్చిన గంగాజలం ఇస్తున్నారని ప్రచారం చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించారు.. ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయింది . అయితే అదే రోజున  మార్చ్ 28న ప్రభాస్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రాఘవేంద్ర సినిమా కూడా రిలీజ్ అయింది .. ఈ సినిమాకి కూడా నెగటివ్ టాక్‌ వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది .. దాంతో సైలెంట్గా వచ్చిన ఈ సినిమా అలాగే సైలెంట్ గా వెళ్ళిపోయింది .. అలా అల్లు అర్జున్ ప్రభాస్ పై మొదటి సినిమాతోనే పై చెయ్యి సాధించడం .

మరింత సమాచారం తెలుసుకోండి: