
స్టార్ హీరో ప్రభాస్ బ్రహ్మ రాక్షస సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారని భోగట్టా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతంలో బిల్లా సినిమాలో కూడా ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో సైతం ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి. వార్2 సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు. వార్2 సినిమా ఈ ఏడాది ఆగష్టు నెలలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని ఒక పాత్రలో బన్నీ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారని భోగట్టా. మంచు మనోజ్ సైతం మిరాయ్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది స్టార్ హీరోలు సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. అయితే విలన్ రోల్స్ వీళ్లకు ఎంతమేర కలిసొస్తుందో చూడాల్సి ఉంది.