టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ కొంత కాలం క్రితం డీజే టిల్లు అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం మార్చి 29 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి మార్చి 29 వ తేదీతో ఒక సంవత్సరం కంప్లీట్ అయింది. మరి ఈ సినిమా ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ మూవీ కి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలు తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 25.88 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 5.3 కోట్లు , ఉత్తరాంధ్రలో 5.71 కోట్లు , ఈస్ట్ లో 3.01 కోట్లు , వెస్ట్ లో 1.90 కోట్లు , గుంటూరులో 2.65 కోట్లు , కృష్ణ లో 2.36 కోట్లు , నెల్లూరులో 1.47 కోట్లు , మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 47.57 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.54 కోట్లు , ఓవర్సీస్ లో 15.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 67.21 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ కి 23.3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 67.21 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ 43.21 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: