సినిమా ఇండస్ట్రీ లో ఒక మూవీ లో మొదట ఓ ముద్దుగుమ్మను హీరోయిన్గా అనుకోవడం , ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో వేరే వారిని పెట్టుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సినిమాలో ఒక హీరోయిన్ ను అనుకొని ఆమెకు కథను కూడా చెప్పి ఆమె సినిమా ఓకే చేసిన తర్వాత ఆమెపై షూటింగ్ ను కూడా మొదలు పెట్టాక ఆ ముద్దు గుమ్మ ను తీసేసి వేరే వారిని పెట్టుకోవడం అనేది చాలా తక్కువ శాతం జరుగుతూ ఉంటుంది.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకున్న  ఓ బ్యూటీ కి కూడా జరిగింది. ఇక ఆమె ఆ తర్వాత నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఒక్కో విజయాన్ని అందుకుంటూ , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది. మరి ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ , ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందట. ఇక రకుల్ పై షూటింగ్ కూడా మొదలు పెట్టి కొంత భాగం పూర్తి చేశారట. ఆ తర్వాత మూవీ బృందం వారు రకుల్ ఆ సినిమాలోని పాత్రకి అంతగా సెట్ అవడం లేదు అనే ఉద్దేశంతో ఆమెను ఆ సినిమా నుండి తీసేసి అదే పాత్రలో కాజల్ అగర్వాల్ ను పెట్టుకున్నారట.

ఇక ఈ సినిమా నుంచి విజయాన్ని సాధించింది. కాజల్ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే రకుల్ "వెంకటాద్రి ఎక్స్ప్రెస్" అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది. ఈ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: