టాలీవుడ్ వాళ్లకున్న సిక్వెల్స్ మీద ఉన్న పట్టు వేరు .. సాధారణ భారతీయ సినిమాల్లో తొలి భాగం సూపర్ హిట్ అయిన రెండో భాగం ఆ స్థాయిని సాధించలేకపోవటమే ఎక్కువ . కానీ టాలీవుడ్ మాత్రం ఈ సెంటిమెంట్ ను తిరగరాసింది .. ప్రతి సిక్వల్ లో కొత్తదనం చూపిస్తూ మొదటి భాగం కంటే బెటర్ గా ప్రేక్షకులు మనసు గెలుచుకుంటున్నారు .  ఈ ట్రెండుకు బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది బాహుబలి సిరీస్ .. తొలిభాగం ఓ గొప్ప క్లాసిక్ గా నిలవగా రెండో భాగం దానికి మించి కలెక్షన్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది .
 

అదే తంతుగా పుష్ప2 విషయంలను అదే రిపీట్ అయింది .. అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది .. ఇది తెలుగు దర్శకుల ప్లానింగ్ కి ఊహించని ఆదరణ .. అయితే ఇక్కడ కేవలం పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఇదే స్థాయిలో టాలీవుడ్ లో సిక్వెల్స్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తున్నాయి .. హిట్ సిరీస్ , మత్తు వదలరా , టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు మొదటి భాగానికి మించి మరింత ప‌దును పెట్టి రెండో భాగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .

 

టెక్నికల్ గా స్క్రీన్ ప్లే పరంగా మెచ్చుకోదగ్గ విధంగా చూపించడమే టాలీవుడ్ సక్సెస్ కు ప్రధాన కారణం .  ఇదే తరహా ఇతర ఇండస్ట్రీలు చేస్తున్న ఫలితాలు మాత్రం వీటికి భిన్నంగా ఉంటున్నాయి .  కోలీవుడ్లో ఇండియన్ 2 మలయాళం లో లూసీ ఫర్ 2 లాంటి సినిమాలు భారీ అంచనాల తో వచ్చి స్టోరీల బలహీనత కారణంగా ఆశించిన స్థాయికి వెళ్లలేదు .. ఇలాంటివి చూస్తే స్టార్ కాస్టింగ్ కన్నా కథ బలంగా ఉండాలన్న విషయం మరోసారి స్పష్టమవుతుంది .

 

అందుకే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ స్టీఫల్స్ కు హబ్ గా చూడ‌టం ఇది కొత్త కాదు .. మాస్ క్లాస్ థ్రిల్లర్ కామెడీ జోనర్ ఏదైన అయిన తొలి బాగం సక్సెస్ అయితే రెండో భాగానికి ప్రేక్షకల్లో మంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది .. ఇక్కడ బడ్జెట్ కాదు బలమైన స్టోరీ సీక్వెల్‌ని నిలబెట్టేది అనేది తెలుగు దర్శ‌కుల సిద్ధాంతం . ఇక  ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వస్తున్నాయి .. ఇప్పుడు రాబోయే రోజుల్లో సీక్వెల్ సినిమాలు కూడా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: