గత కొద్ది రోజులుగా ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందిన  నా అన్వేషణ గురించి ఏదో ఒక న్యూస్ అయితే వినిపిస్తూ ఉంది. ప్రపంచమంతా తిరుగుతూ ఎన్నో దేశాలను అక్కడ ఉండేటువంటి సాంస్కృతిని కూడా తెలుపుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతమందిని ఆకట్టుకున్న నా అన్వేషణ ఇటీవలే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారందరినీ కూడా తిడుతూ ఫేమస్ అయ్యారు. అలా నిరంతరం సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉన్న నా అన్వేషే. గురించి తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి వాటి గురించి చూద్దాం.


బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న కొంతమంది యూట్యూబర్స్ పై ఫైర్ అవుతు ఎవరెవరు ఎలాంటి స్కామ్ చేస్తున్నారో అనే విషయాలను కూడా బయట పెడుతున్నారు అన్వేష్.. ముఖ్యంగా వీరితోపాటు కొంతమంది సినీ తారలు కూడా ఉన్నారనే విషయాన్ని బయట పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు బయటికి రావడంతో విచారణ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత నా అన్వేష్ పైన ఫైర్ అయ్యింది.


హీరోయిన్ మాధవి లత కూడా పలు చిత్రాలలో తెలుగులో హీరోయిన్గా కూడా నటించింది.. నచ్చావులే సినిమాతో పాటు నానితో కూడా ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి సమాజంలో జరిగే విషయాల పైన కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పని చెబుతున్నారో..అదే వ్యక్తి కూడా విదేశాలకు వస్తే పాపలతో తిరగవచ్చు మీరు కూడా విదేశాలకు వచ్చేయండి.. ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయవచ్చు అని చెబుతున్నడని మాధవి లత తెలిపారు.. మరి అన్వేష్ మాట్లాడే మాటలు ఎలాంటివి నేర్పుతున్నాయి.. ఇది కరెక్టే నా ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా తనని తిట్టినా పరవాలేదు తాను నిజాన్ని నిర్భయంగానే చెబుతాను అంటూ తెలిపింది. ఫారెన్ కంట్రీ కి వెళ్తే మనం కూడా పాపలతో తిరగవచ్చుని ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి, డబ్బులు కావాలి అంటే కూడా కచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఉపయోగించే సంపాదించాలనుకుంటారు.. ఇతని లగ్జరీ లైఫ్ చూసే చాలామంది బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెడుతున్నారనే విధంగా తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: