టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ ఎక్కువగా  ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు.. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రూ.300 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో మంచి విజయాన్ని అందుకున్న సమయంలోనే వెంకటేష్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రిలో గసగసాలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే విక్టరీ వెంకటేష్ మరొక ఏడాది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారని.. వచ్చే సంక్రాంతికి కూడా తన నుంచి ఏ సినిమా రిలీజ్ చేరట.. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు, కామెడీ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నరు వెంకటేష్ నుండి సినిమాలు రావని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


సాధారణంగా వెంకటేష్ సినిమా సక్సెస్ అయిందంటే చాలు ఎక్కువగా కుటుంబంతో కలిసి వేకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం వెంకటేష్ మోకాలికి తీవ్రమైన గాయం అయ్యిందని దీంతో ఇబ్బంది పడుతున్నట్లుగా టాలీవుడ్ పరిశ్రమలు గుసగుసలు వినిపిస్తున్నాయి.  అంతేకాకుండా వైద్యులకు కూడా చూపించగా వైద్యులు కూడా వెంకటేష్ ని కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.

అందుకే హీరో వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది చివరి వరకు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుందని సమాచారం.. ఒకవేళ వచ్చే ఏడాది తదుపరి సినిమాల షూటింగ్ చేస్తే ఆ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నది.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్, యువి బ్యానర్ తో పాటుగా మరి కొన్ని బ్యానర్లలో వెంకటేష్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వెంకటేష్ మీద వస్తున్న ఈ వార్తలు నిజమో కాదా తెలియాలి అంటే అటు విక్టరీ వెంకటేష్ స్పందించాల్సి ఉన్నది. దీంతో అభిమానులు కొంతమేరకు నిరాశలో ఉన్నారు. మరి ఈ విషయం పైన ఎవరు స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: