సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు జరిగేటివి చాలా చాలా చూస్తూ ఉంటాం . అయితే ఒక వీడియో ఎక్కడైనా వైరల్ అయింది అంటే ఆ వీడియోలో అసలు జరిగింది ఏంటి అన్న దానికన్నా కూడా ఆ వీడియోని  నెగిటివ్గా చూడడమే ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ట్రోలర్స్ మీమర్స్ అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటారు.  తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ గా మారింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించింది కావడం గమనారహం.


ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించబోయే సినిమా పూజ కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరిగాయి . అయితే ఈ వేడుకకు పలువురు స్టార్స్ కూడా వచ్చారు . అందరినీ చిరంజీవి దగ్గరుండి పలకరించుకున్నారు.  కానీ అల్లు అరవింద్ నీ మాత్రం అసలు చూసి చూడనట్టు వదిలేశారు.  అక్కడ ఉండే వారందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు . కానీ అల్లు అరవింద్ కి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.



అల్లు అరవింద్ ముఖం కూడా కొంచెం డల్ గా పెట్టిన క్లిప్స్ బాగా వైరల్ అవుతున్నాయి.  అయితే ఇది నిజంగానే చిరంజీవి కావాలని చేశాడా..?  లేకపోతే పొరపాటున టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో చేశాడా ..? ఏమో చిరంజీవి మనసులో ఏ ఉద్దేశ్యం ఉందో కానీ అల్లు అరవింద్ ఫ్యాన్స్ మాత్రం డీప్ గా హర్ట్ అయిపోయారు. చిరంజీవి కావాలనే ఇలా చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి ఇలాంటి కామెడీ డైరెక్టర్ చిరంజీవితో సినిమా చేస్తున్న మూమెంట్లో ఇలా సోషల్ మీడియాలో నెగిటివిటీ రావడం ఫాన్స్ కి కూడా డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది.  అనిల్ రావిపూడి ఎలా దీనిని పాజిటివిటీగా మార్చుకుంటారు అనేది చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: