సమంత ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . రష్మిక ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.  సమంత ఒకప్పుడు సినిమాలు చేసింది..  ఇప్పుడు సినిమాలను తగ్గించేసింది . మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలోకి రావడానికి ట్రై చేస్తుంది. అయితే సమంత పేరుకు ఉన్న క్రేజ్ - పబ్లిసిటీ - పాపులారిటీ రష్మిక మందన్నాకు రానే రాదు అని చెప్పాలి . సమంత వేరే రష్మిక వేరే..  వీళ్లిద్దరిని కంపేర్ చూచి చూస్తే రష్మిక కన్నా సమంతకి నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయి . ఆ విషయం అందరికీ తెలుసు . అయితే ఈ 2025 మొత్తం కూడా రష్మిక మందన్నా చేతుల్లోనే ఉండిపోతుంది అని అంతా భావించారు .


సమంత ఎలాగో సినిమాలు చేయడం లేదు .. ఇక శ్రీలీల చేసిన సినిమాలు హిట్ అవ్వడం లేదు . ఇండస్ట్రీలో అయితే హీరోయిన్ అంటే చెప్పుకోదగ్గ రేంజ్ లో ఉండేది రష్మిక మాత్రమే . పోయిన ఏడాది అంతకుముందు ఏడాది మొత్తం రష్మిక కొట్టేసింది . ఈ సంవత్సరం కూడా రష్మిక మందన చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ ఉండబోతుంది అని అంతా అనుకున్నారు . కానీ ఇప్పుడు రష్మిక కన్నా ముందే జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది ఓ టాప్ హీరోయిన్ . ఆమె ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ "పూజా హెగ్డే" .



సైలెంట్ గానే  రష్మిక ప్లేస్ కొట్టేయబోతుంది .  ఆల్రెడీ కోలీవుడ్ లో రెండు సినిమాలకు కమిట్ అయింది . ఆ సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వాలి . కచ్చితంగా ఒకటి మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే బాలీవుడ్ లో కూడా రెండు వెబ్ సిరీస్లను ఓకే చేసింది . త్వరలోనే అవి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.  కచ్చితంగా వెబ్ సిరీస్ అంటే పూజా హెగ్డే లోని మరో యాంగిల్ ని చూడొచ్చు.  అలా చూసుకున్నా కూడా పూజ హెగ్డే కోలీవుడ్ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రిల లో బాగా మంచి స్థానం దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయి . ఇక తెలుగు ఇండస్ట్రీలోకి వస్తే "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నాగచైతన్యతో ఆమె ఒక సినిమాలో నటించబోతుందట . నాగచైతన్య లాంటి హిట్ హీరోతో పూజ హెగ్డే సినిమా అంటే హిట్ కాకపోయినా యావరేజ్ గానే నిలుస్తుంది . ఈ విధంగా చూసుకుంటే 2025 మొత్తం కూడా పూజ హెగ్డే చేతుల్లోనే ఉండిపోతుంది అని రష్మిక కి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: