తాను ఒకటి తలుచుకుంటే దైవం మరొకటి తలచింది అన్నట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ పూట బ్యాడ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . అల్లు అర్జున్ పుష్ప2 సినిమా తర్వాత ఎలాంటి దర్శకుడు దర్శకత్వంలో సినిమాను ఓకే చేస్తాడు అని కోట్లాదిమంది ప్రేక్షకులు ఎదురుచూశారు . చాలామంది మాత్రం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తోనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆల్ రెడీ వీళ్ల కాబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో..ఎలాంటి హిట్ అందుకున్నాయో అందరికి తెలిసిందే.


 కానీ ఆయనతో సినిమాను పక్కన పెట్టి ఎవరు ఊహించని విధంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఛాన్స్  ఇచ్చాడు బన్నీ. అంతేనా హైదరాబాద్ వచ్చి మరి అట్లీ టీం అల్లు అర్జున్ ని  స్పెషల్ గా లుక్ టెస్ట్ చేసింది . కాగా వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే సినిమా పూజ కార్యక్రమాలు ఉగాది రోజున జరుగుతాయి అని అంతా అనుకున్నారు.  కానీ ఈరోజు అటువంటి అప్డేట్ ఏదీ లేదు.. రాలేదు . దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు .



తెలుగు వాళ్లకి ఉగాదియే న్యూ ఇయర్ . అయితే సంవత్సరం మొదటి రోజే ఇలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు అంటే ఇక ఇయర్ మొత్తం అలాగే డిసప్పాయింట్ అవుతూ ఉంటారా ..? అనే రేంజ్ లో కావాలనే కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . బన్నీ పుష్ప2 సినిమా తర్వాత సోషల్ మీడియాలో హ్యూజ్ నెగిటివిటీ ఎదుర్కొంటున్నారు.  ఇప్పుడు అట్లీ సినిమా విషయంలోనూ అలాగే చేస్తారా..? అనేది బిగ్ హాట్ టాపిక్ గా మారింది . అల్లు అర్జున్ ఈ ఇయర్ తన సినిమాలను ఎలా ముందుకు తీసుకెళ్తాడు ..? అనేది ఫ్యాన్స్ కి బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: