సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇటీవలే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తన తదుపరిచిత్రాన్ని హీరో చిరంజీవి తో చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా పూజ కార్యక్రమాలతో చిత్ర బృందం సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలకు హీరో వెంకటేష్, అల్లు అరవింద్, అశ్వని దత్, దగ్గుబాటి సురేష్ బాబు, నిర్మాత నాగ వంశీ, దిల్ రాజు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, వశిష్ట, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదెల, బాబి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్యఅతిథిగా హాజరు కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ముఖ్యంగా ఇంత మంది ఒకేసారి చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ కి రావడంతో కచ్చితంగా ఈ సినిమా ఎలా ఉంటుందో ఇక ఎక్స్పెక్ట్ చేయాల్సిన పనిలేదు.. కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి తలకెక్కించడంలో దిట్ట అని ఎన్నోసార్లు నిరూపించారు. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా భాగమైందట. చిరంజీవికి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం హీరోయిన్ అదితిరావు హైదరిని సంప్రదించినట్లు తెలుస్తోంది.. ఇందులో చిరంజీవి అసలు పేరు శంకర వరప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారట. చిరంజీవి 157 వ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ వశిష్ట తో విశ్వంభర సినిమాలో  నటిస్తూ ఉన్నారు. సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి గతంలో పోస్టర్లు.. గింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.. గ్రాఫిక్స్ కూడా ట్రోల్ చేసేలా ఉండడంతో ఇక అప్పటినుంచి ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: