అక్కినేని కోడలు శోభిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన నటనతో ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకున్న ఈ చిన్నది మొదట మోడలింగ్ తో తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో తన స్నేహితుల సహాయంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న శోభిత వరుసగా కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఇక అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం కొనసాగించిన శోభిత గత కొద్ది రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. చాలా సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించిన చైతు, శోభిత ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత శోభిత ఇప్పటివరకు ఎలాంటి సినిమాలలో నటించలేదు. చైతు మాత్రం తండేల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు చైతన్య తన తదుపరి సినిమాలో కూడా నటించడానికి రెడీ అవుతున్నారట. ఇదిలా ఉండగా.... ఈ జంట రీసెంట్ గా హనీమూన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే.

క్కడ శోభిత, చైతు కలిసి బయట ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను వారి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా, అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక త్వరలోనే చైతు, శోభిత పిల్లలను కూడా కణాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో శోభితకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలలో శోభిత బేబీ బంప్ తో కనిపించిఅందరికీ షాక్ ఇచ్చింది.

ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. శోభిత ప్రెగ్నెంట్ అని కొంతమంది అంటుంటే.... మరి కొంత మంది అది సినిమాలో ఫోటో అని అంటున్నారు. ఈ ఫోటోను వివరంగా పరిశీలించినట్లయితే అది శోభిత సినిమాలో నటించిన పాత్ర అని తెలిసింది. ఈ ఫోటోపై క్లారిటీ వచ్చిన అనంతరం అందరూ సైలెంట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: