
ఈ సినిమా అనంతరం హనీ రోజ్ కి వరుసగా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంది. కాగా, హనీ రోజ్ కి ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత చేస్తూ గ్లామర్ షో చేస్తోంది. తన అందాల ఆరబోతలో ఈ బ్యూటీ ఏ మాత్రం రాజీ పడడం లేదు. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.... ప్రస్తుతం హనీ రోజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. హనీ రోజ్ ఓ తమిళ హీరోతో హోటల్ లో దొరికిందట. ఆ హీరోతో హనీ రోజ్ ప్రేమాయణం కొనసాగిస్తుందట. అంతేకాకుండా త్వరలోనే ఆ హీరోని వివాహం చేసుకోవాలని అనుకుంటుందట. ఆ కారణం చేతనే వీరిద్దరూ వెకేషన్ కి వెళ్ళారని, అక్కడ హోటల్ లో కలిసి ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం హనీ రోజ్ కి సంబంధించి ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.