స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. మొదట్లో తన సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కొన్ని సినిమాలు చేసిన అనంతరం అల్లు అర్జున్ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. '


ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను డైరెక్టర్ అట్లితో తీయబోతున్నారు. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో "AA22" సినిమాకి సంబంధించి రంగం సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన AA22 సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఇండస్ట్రీవర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ మేడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప-2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం అల్లు అర్జున్ తీయబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం తీసిపోని విధంగా దర్శకుడు అట్లి మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో ఈ సినిమాను తీయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ  సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: