టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి జెనీలియా ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జెనీలియా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందం, అభినయం, నటన, అల్లరితనంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిన్నది తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.


తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ చిన్నది తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషలలో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది. తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. వివాహ అనంతరం ఇద్దరు మగ పిల్లలకు జెనీలియా జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి సినిమాలలో తిరిగి నటించాలని అనుకుందట.


 కానీ అప్పటికే జెనీలియాతో సినిమాలు చేయడానికి ఎవరు సిద్ధంగా లేనట్లుగా తెలిసిందట. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాలలో నటించిన ఏమాత్రం సెట్ కాలేదని అన్నారట. అంతే కాకుండా నటన పరంగా నిరాశపరిచావని చెప్పారట. ఆ మాటతో ఈ బ్యూటీ కాస్త బాధ పడినప్పటికీ వారి మాటలు ఏమాత్రం వినకుండా మరోసారి ధైర్యం చేసి సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకొని ముందుకు సాగిందట. ఇక జెనీలియా 2022లో నటించిన "వేద్" సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


సినిమా మంచి సక్సెస్ అనుకున్న అనంతరం జెనీలియా వివిధ సినిమాలలో నటించి మంచి సక్సెస్ సాధించారు. ప్రస్తుతం జెనీలియా ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. ఇక జెనీలియా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి భారీగానే ఫాలోవర్స్ ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: