సాధారణంగా హీరోయిన్ల కంటే హీరోల దగ్గర ఎక్కువగా లగ్జరీ వస్తువులతో పాటు, గ్యాడ్జెట్స్ మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాము. అలాగే కాస్ట్లీ కార్లు కూడా హీరోల దగ్గర ఎక్కువగా ఉంటాయి. అయితే హీరోయిన్ల దగ్గర లగ్జరీ కార్లు చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. అలా ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శ్రద్ధ కపూర్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లెక్సస్ LM 350H-4 కారును కొనుగోలు చేసింది శ్రద్ధా కపూర్. సుమారుగా ఈ కారు ధర 3 కోట్ల రూపాయలు ఉన్నదట.



గత ఏడాది కూడా ప్రముఖ కంపెనీకి చెందిన కారుని కొనుగోలు చేసిన  శ్రద్ధా కపూర్ మళ్లీ ఇప్పుడు ఒక కొత్త కారు కొనుగోలు చేసింది. ఇక ఈ కారుకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇందులో కేవలం నలుగురు మాత్రమే కూర్చోగలిగిన కెపాసిటీ ఉన్నదట. కారు వెనక భాగంలో విలాసవంతంగా ఉంటుందని.. ఈ కారులో రిలాక్స్ సీటు కూడా అమెరికా ఉంటుందట. ఇది 48 అడుగుల డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది.

అలాగే సన్ రూప్, ఫ్రిజ్ వంటివి కూడా కలిగి ఉంటాయట. ఈ కార్ పెట్రోల్ వేరియంట్ తో మాత్రమే దొరుకుతుందట. ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టం కలదు. ఈ కారు ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దగ్గర రణబీర్ కపూర్ దగ్గర మాత్రమే ఉన్నదట. మొత్తానికి ఖరీదైన కారుతో ప్రభాస్ బ్యూటీ మరొకసారి వార్తలలో నిలుస్తోంది తెలుగులో సాహో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ ఏ చిత్రంలో కూడా కనిపించలేదు మరి రాబోయే రోజుల్లో మరికొన్ని చిత్రాలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: