గత నెల రోజుల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రన్య రావు . ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈమె 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండడంతో ఒకసారిగా DRI అధికారులు ఈ కన్నడ నటిని పట్టుకొని కేస్ ఫైల్ చేసి మరి విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా విచారణ చేస్తూ ఉండడంతో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అయితే ఇలా రన్య రావు ఎన్నోసార్లు ప్రోటోకాల్ ని ఉపయోగించి మరి ఈమె బయటికి విమానాశ్రయం నుంచి వెళ్ళిపోతూ ఉండేదని పలు రకాల ఆరోపణలు కూడా చేశారు.


ఈ కేసు పైన ప్రభుత్వం కూడా సీరియస్ గా అయ్యి సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా ను కూడా విచారించాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వం ఒక నివేదిక నిన్నటి రోజున సమర్పించారు.. రన్యరావు తండ్రి డీజీపీ రామచంద్ర రావు కూడా తన కూతుర్ని ప్రోటోకాల్ ఉపయోగించమని ఎప్పుడూ చెప్పలేదు కానీ ఆమె ప్రోటోకాల్ ఉపయోగిస్తుందని తెలుసని విచారణలో రన్య రావు తెలియజేసింది. ఈ విషయం పైన ఐఏఎస్ అధికారి 230 పేజీలు నివేదికను కూడా ప్రధాన కార్యదర్శి కి సమర్పించారట.


రన్య రావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని విమానాశ్రయం నుంచి తరలించడానికి ప్రభుత్వం వాహనాలను ఉపయోగించినట్లు డిఆర్ఐ దర్యాప్తులో తేలింది.. ఐఏఎస్ అధికారులకు అందరికీ కూడా  అదనంగా రెండు కార్లు ఇచ్చారని అది ఒకటి అధికారికి మరొకటి అధికారి కుటుంబానికి ఉపయోగించుకుంటున్నారట. అదే విధంగా డీజీపీ రామచంద్రకు కూడా ప్రభుత్వం ఇలాగే మంజూరు చేసింది.. కానీ ప్రభుత్వ వాహనంలో ఇలా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ విమానాశ్రయానికి ఎన్నోసార్లు ప్రయాణించిందట. రన్య రావు బెయిల్  పిటీషన్ తిరస్కరణకు గురైన తర్వాత అటు ఈడి, సిబిఐ నుంచి అరెస్టు బెదిరింపులు కూడా ఈమెకు ఎదురవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: