మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రామ్ చరణ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించిన అనంతరం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది .ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లుగా పెద్ది సినిమా టీమ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి చిత్ర బృందం పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తోంది. ఈ సినిమాతో మరోసారి ఈ చిన్నది తన టాలెంట్ ను నిరూపించుకోబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ సమంతను చిత్ర బృందం సంప్రదించారట. ఇక సమంత ఐటమ్ సాంగ్ లో చేయడానికి కొద్ది రోజుల సమయాన్ని కోరిందట.

మరి సమంత కొద్ది రోజుల గ్యాప్ అనంతరం ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరిస్తుందా లేదా అనే సందేహంలో బుచ్చిబాబు ఉన్నారట. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. మరి సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: