మోహన్ లాల్, పృధ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన లూసీఫర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన L2 ఎంపురాన్ సినిమా కూడా ఇటీవలే మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే లూసిఫర్ కథకి సంబంధం లేకుండా ఇందులో గుజరాత్ అల్లర్లు, కేరళ పార్టీలోని గొడవలు కొన్ని మత ఘర్షణలు చూపించడంతో చాలామంది ఈ సినిమాను చూసి ఇది లూసిఫర్ సినిమాకి సీక్వెల్ ఏనా అంటూ నిరాశలో చెందారట.


అయితే కొన్ని సందర్భాలలో గుజరాత్ అల్లర్లను ఒక వర్గం వారికి సపోర్ట్ చేసి చూపించడం మరొక వర్గాన్ని కించపరిచేర డైలాగులు చెప్పడం వంటివి చేయడంతో పాటు కొంతమంది రాజకీయాలను ఉద్దేశించి కొన్ని సన్నివేశాలు తీశారని దేశవ్యాప్తంగా L2 సినిమా పైన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో చాలామంది మోహన్లాల్ ఇలాంటి సినిమాని తీయడమేంటి అంటు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే బాయ్ కాట్ ఏంపురాన్ అనే ట్రెండింగ్ అవుతుండడంతో.. అంతేకాకుండా సెన్సార్ మీద కూడా ఇలాంటి సన్నివేశాలను ఎలా ఇచ్చారంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు.


L2 ఎంపురాన్ భారీ ఓపెనింగ్స్ రాబడినప్పటికీ విడుదలైన రెండవ రోజుకి థియేటర్లలో చాలావరకు ఖాళీగా కనిపించాయట. దీంతో నిర్మాత సంస్థలు వెనక్కి తగ్గి 17 నిమిషాల పాటు సినిమాలోని సన్నివేశాలను కట్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారట. మోహన్లాల్ వంటి హీరో పైన విమర్శలు రావడంతో స్పందిస్తూ ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.. లూసీ ఫర్ సీక్వెల్ గా వచ్చిన L2 ఎంపురాన్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు సామాజిక రాజకీయ సన్నివేశాలకు బాధ కలిగించాయని తెలుసుకున్నారని తన సినిమాలో ఏ రాజకీయ ఉద్దేశం మతపరమైన భాషల పట్ల ద్వేషం కూడా ఉండకూడదని అది నటుడుగా నా కర్తవ్యం.. ఎవరికైనా ఈ సినిమా వల్ల కలిగిన బాధకు తాను చింతిస్తున్నానని అందుకు బాధ్యుడను కూడా తానేనని.. అందుకు తన టీమ్ కు తాను నుంచి క్షమాపణలు చెబుతున్నానంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: