గ్లోబల్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ రంగస్థలం “ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రంగస్థలం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ఊర మాస్ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. చిట్టి బాబు పాత్రలో రాంచరణ్ జీవించాడు.. రంగస్థలం సినిమాకు ముందు రాంచరణ్ నటన గురించి ఎక్కడో చోట నెగటివ్ కామెంట్స్ వినిపించేవి.. కానీ రంగస్థలం సినిమాలో చరణ్ అద్భుతంగా నటించాడు.. చెవులు వినిపించని చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ జీవించాడు..

అలాగే అప్పటి వరకు లాజికల్ మూవీస్ చేసిన సుకుమార్ మొదటి సారి ట్రాక్ మార్చి పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ రా అండ్ రస్టిక్ మూవీ తెర కెక్కించాడు.. ఈ సినిమాలో ప్రతీ పాత్ర ఎంతో న్యాచురల్ గా ఉంటుంది.. కుమార్ బాబు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి సైతం తన పాత్రలో అద్భుతంగా నటించాడు.. రామలక్ష్మి పాత్రలో సమంత కరెక్ట్ గా షూట్ అయింది..తన అద్భుతమైన నటనతో సామ్ ప్రేక్షకుల మనసు దోచేసింది.. ఇక ఈ సినిమా లో మెయిన్ క్యారెక్టర్ అయిన రంగమ్మత్త పాత్రలో అనసూయ అదర గొట్టింది..ఒక రకంగా సుకుమార్ అనసూయకి మంచి బ్రేక్ ఇచ్చారు.. అనసూయ ఈ పాత్రలో అద్భుతంగా నటించింది..

 ఇక ప్రెసిడెంట్ గా జగపతి బాబు, మెయిన్ విలన్ గా ప్రకాష్ రాజు నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.. రంగస్థలం మూవీ ఇంతటి ఘన విజయం సాధించడానికి సుకుమార్ టేకింగ్, నటి నటుల పెర్ఫార్మన్స్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సైతం ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు.. దేవిశ్రీ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అదిరిపోతుంది.. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు దేవిశ్రీ పూర్తి న్యాయం చేసారు.. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ రిలీజ్ అయి 7 ఏళ్లు పూర్తీ అవుతుంది. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయమని కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: