కోలీవుడ్, టాలీవుడ్ లో కమలహాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాక్టింగ్ తోనే ఎంతోమందిని ఆకట్టుకున్న కమలహాసన్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించారు. ముఖ్యంగా సినిమాల పట్ల ఎంతో పట్టుదలతో ఉంటారు. అందుకే ఎలాంటి పాత్రలోనైనా సరే అవలీలగా నటిస్తూ ఉంటారు. తన ప్రతి సినిమాకి తన లుక్కుని సైతం మార్చుకుంటూ ఉంటారు కమలహాసన్ .అందుకే ఆయనకు విశ్వ నటుడుగా కూడా పేరు సంపాదించారు. అయితే ఇలాంటి కమలహాసన్ పైన ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఆశ్చర్యపోయే కామెంట్స్ చేసింది.


హీరోయిన్ ఎవరో కాదు పూనమ్ ధిల్లాన్. కమల్ హాసన్ అందరి ముందే తనని తిట్టాడంటు చెప్పి బిగ్ బాంబు పేల్చింది.. ఈమె బాలీవుడ్ తో పాటుగా సౌత్ లో కూడా పలు చిత్రాలలో నటించింది కమలహాసన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఈమె ఆలస్యంగా వెళ్లడంతో కమలహాసన్ ఈమె పైన ఫైర్ అయ్యారట. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం గంటలకొద్ది లేటుగా వెళ్లిన ఎవరు ఏమీ అనేవారు కాదని అందుకే మేము అలాగే అలవాటు పడిపోయామంటూ తెలియజేసింది పూనమ్ .


అందుకే కమలహాసన్ తో సినిమా ఒప్పుకున్నప్పుడు తనకి ఇలాంటివి ఏమీ తెలియదని.. కానీ సినిమా షూటింగ్ కి మాత్రం తాను ఒక రోజు గంట లేటుగా వెళ్లాను..తాను ఆలస్యంగా వెళ్లిన పచ్చతాపం కనిపించలేదని..కామన్ గానే ఉన్నాను అందరూ సెట్ లో తనని సీరియస్ గా చూస్తుండడం చూసి ఏం జరిగింది అబ్బా అనుకుంటున్నా సమయంలో కమలహాసన్ వచ్చి నువ్వు ఎందుకు ఇంత లేటుగా వస్తున్నావ్.. లైట్ బాయ్, కెమెరామెన్  ఉదయం 5 గంటలకే వచ్చారు వారందరూ కూడా నీకోసమే గంటలు తరబడి ఎదురుచూస్తున్నారు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నావో ఆలోచించు అంటూ వార్నింగ్ ఇచ్చారట.. అప్పుడే తప్పు తెలుసుకుని అందరికీ క్షమాపణలు చెప్పమని అడిగానని ఇక అప్పటినుంచి సినిమా షూటింగ్ కి లేటుగా వెళ్లలేదని తెలిపింది పూనమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: