తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి ఈయన వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాంటి సమయంలోనే ఈయన "క" అనే సినిమాలో హీరో గా నటించాడు.

సినిమా విడుదల సమయంలో "క" మూవీ కనక విజయం సాధించకుంటే సినిమాలకే దూరం అవుతారు అని కిరణ్ చెప్పుకొచ్చాడు. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో కిరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. "క" లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక "క" లాంటి మంచి సక్సెస్ తర్వాత కిరణ్ నుండి వస్తున్న సినిమా కావడం , అలాగే కిరణ్మూవీ పై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు కిరణ్మూవీ విడుదల ముందు చెప్పడం , అలాగే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ విడుదలకు ముందు రోజే ప్రదర్శించనున్నట్లు కిరణ్ ప్రకటించాడు. దానితో ఈ మూవీ కూడా మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ సినిమాకి అదే టాక్ కంటిన్యూ కావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే "క" లాంటి సక్సెస్ తరువాత కిరణ్ కాస్త కథలో కొత్తదనం ఉన్న సినిమాలో నటిస్తే బాగుండేది అని , దిల్ రూబా సినిమా కథ చాలా రొటీన్ గా ఉండడం , స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతోనే దిల్ రూబా సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: