దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హరీష్ శంకర్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన పేరు చెప్పగానే అందరికీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమానే గుర్తుకొస్తుంది.ఇక మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయినటువంటి హరీష్ శంకర్ తన అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యారు.అలా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ఇక పవన్ కెరియర్ లో గబ్బర్ సింగ్ సినిమా ఒక మైలు  రాయి అని చెప్పుకోవచ్చు. ఇక హరీష్ శంకర్ మిరపకాయ్,షాక్,గద్దల కొండ గణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,రామయ్య వస్తావయ్యా, దువ్వాడ జగన్నాధం, Mr. బచ్చన్ వంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం చేశారు.

ఇక ఈయన పవన్ కళ్యాణ్ తో చేసే రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వాయిదా పడ్డ సంగతి మనకు  తెలిసిందే.. ఇక గత ఏడాది విడుదలైన Mr. బచ్చన్ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయినా సంగతి తెలిసిందే. దాంతో హరీష్ శంకర్ ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైనే ఉన్నాయి. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన కామెంట్లు చేశారు.. హరీష్ శంకర్ స్నిగ్దా ని పెళ్లాడిన సంగతి మనకు తెలిసిందే.అయితే పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు అయినా కూడా ఇప్పటివరకు పిల్లల్ని  కనలేదు.

అయితే ఆ ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి హరీష్ శంకర్ కి ప్రశ్న ఎదురైంది. దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు హరీష్ శంకర్.ఆయన మాట్లాడుతూ.. నేను లైఫ్ లో పిల్లల్ని వద్దనుకున్నాను. ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం. నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు. వారిద్దరికీ పెళ్లి చేసి వారిని లైఫ్ లో సెటిల్ చేయాలి. కానీ పిల్లలు పుడితే స్వార్థం పెరిగిపోయి మనది మనమే సంపాదించుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. అందుకే నా భార్య నేను కూర్చొని మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఇప్పటివరకు పిల్లల్ని కనలేదు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు హరీష్ శంకర్

మరింత సమాచారం తెలుసుకోండి: