కొన్ని రోజుల క్రితం రాజా గౌతమ్ , బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఆర్‌ వి ఎస్ నిఖిల్ దర్శకత్వం వహించగా ... వెన్నెల కిషోర్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయినటువంటి బ్రహ్మానందం , రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనబడి పాత్రలో నటించడం , ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడానికి కారణం ఈ మూవీ లో మంచి కథ ఉన్న ఆ కథనం సాగే విధానం మాత్రం అంత గొప్పగా లేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇకపోతే సినిమా విజయం విషయం పక్కన పెడితే ఈ మూవీ లో రాజా గౌతమ్ , బ్రహ్మానందం ఇద్దరు కూడా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అని , అలాగే విన్నర్ కిషోర్ కూడా తన కామెడీ టైమింగ్ తో ఈ సినిమాకు అంతో ఎంతో ప్లేస్ అయ్యాడు అనే అభిప్రాయాలను కూడా చాలా మంది వ్యక్త పరిచారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాజా గౌతమ్ , బ్రహ్మానందం ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న , అలాగే ఈ మూవీ లో కీలక పాత్రలో నటించిన వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా మాత్రం చివరగా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గానే నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: