తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు తయారైంది సల్మాన్ ఖాన్ పరిస్థితి . అది ఎందుకో అందరికీ తెలిసిందే.  చాలా టైం గ్యాప్ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన సినిమా "సికందర్". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని బాలీవుడ్ చరిత్ర తిరగరాస్తుంది అని అంత అనుకున్నారు. సీన్ కట్ చేస్తే సికందర్ సినిమాకి అంత సీన్ లేదు అంటూ తేలిపోయింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక మందన్నా పాత్ర డమ్మీ అని అసలు ఆమె నటన నటనగానే లేదు అని ఓ రేంజ్ లో జనాలు ట్రోల్ చేయడం ప్రారంభించారు.


సికందర్ సినిమాపై ఎంత బడ్జెట్ పెట్టారు..? ఎన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు..? అనే విషయం అందరికీ తెలిసిందే.  అయితే సికందర్ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది . అసలు జనాలను ఆకట్టుకోలేకపోయింది . మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ - రష్మిక ల మధ్య కెమిస్ట్రీ అసలు వర్క్ అవ్వలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా కారణంగా హీరోలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి ..? అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్స్ కధ లేకపోయినా సరే భారీ బడ్జెట్ తో సినిమాను ఓకే చేసేసి సినిమా ఎలా ఉన్నా పర్లేదు మా ఫ్యాన్స్ హిట్ చేస్తారు అన్న రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు .



అయితే జనాలు కూడా ట్రెండ్ మార్చేశారు . కధా కంటెంట్ నచ్చితేనే ఆ సినిమా హిట్ చేస్తున్నారు . లేకపోతే ఫ్లాప్ చేసి పడేస్తున్నారు.  అది ఎంత పెద్ద హీరో అయినా సరే. రాధే శ్యామ్ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయింది అనేది అందరికీ తెలుసు . ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే కానీ ఎందుకు రాధే శ్యామ్ ఫ్లాప్ అయ్యింది అంటే మాత్రం ఆ కథ కాన్సెప్ట్ జనాలకి నచ్చలేదు అని చెప్పుకోకతప్పదు . ఇప్పుడు సికందర్ విషయంలో సల్మాన్ ఖాన్ అలాంటి తప్పే చేశాడు అని సల్మాన్ ఖాన్ లా ఏ హీరో కూడా చేయొద్దు అని అలా చేస్తే మేకర్స్ నష్టపోతారు అని మాట్లాడుకుంటున్నారు. సికందర్  సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు నేర్పిన గుణపాఠం ఏమిటంటే .."సినిమా కథను నమ్ముకోండి సినిమా బడ్జెట్ ని కాదు అనేది జనాల పాయింట్".  చూద్దాం మరి హీరోలు ఎంతవరకు ఈ పాయింట్ ని ముందుకు తీసుకెళ్తారు అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: