హీరోయిన్ టబు నార్త్ పాటు సౌత్ లో కూడా పేరు తెచ్చుకున్న నటి. ఈ హీరోయిన్ ముఖ్యంగా తెలుగులో నాగార్జునతో చేసిన నిన్నే పెళ్లాడతా మూవీ ఇప్పటికి కూడా చాలామంది ఇష్టపడతారు. అలాగే కూలీ నెంబర్ వన్, అందరివాడు, ఆవిడ మా ఆవిడే,పాండురంగడు వంటి హిట్ సినిమాల్లో నటించింది.అయితే అలాంటి టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం సౌత్ వాళ్లేమో నాగార్జున అంటే నార్త్ వాళ్లేమో అజయ్ దేవగణ్ అంటారు. అయితే అజయ్ దేవగన్ టబుకి మధ్య చిన్నప్పటినుండే ఫ్రెండ్షిప్ ఉంది.అజయ్ దేవగన్ టబు సోదరుడి ఫ్రెండ్ కావడంతో అజయ్ దేవగన్, టబు ఇద్దరు ప్రేమలో పడ్డారు.కానీ అజయ్ దేవగన్,టబు ని మోసం చేసి కాజోల్ ని పెళ్లి చేసుకున్నారు. అలా టబు,అజయ్ దేవగన్ ల రిలేషన్ చెడిపోయింది.

ఆ తర్వాత సౌత్ లో నాగార్జునతో ఉన్న ప్రేమ కారణంగానే టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటారు. అంతేకాదు నాగార్జున అమలకి విడాకులు ఇచ్చి టబుని పెళ్లి చేసుకోవాలనుకున్నారనే రూమర్లు కూడా వినిపించాయి. ఇప్పటికి కూడా టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జుననే అంటూ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నాగార్జున ఓ ఇంటర్వ్యూ లో టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నేను కాదు.మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది.మీరు అనుకుంటున్నట్లు ఎలాంటి విషయం లేదు.కానీ అందరికంటే మా ఫ్రెండ్ షిప్ ఇంకాస్త క్లోజ్ గా ఉంటుంది. అంతే అని క్లారిటీ ఇచ్చారు.

అయితే టబు ఆ మధ్య కాలంలో బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియావాలాని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అందరూ తమ అభిమాన హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందని సంతోషించారు. కానీ సడన్గా ఎంగేజ్మెంట్ కి రెండు మూడు రోజులు ఉంది అనగా ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది. ఇక దీనికి కారణం చెప్పకపోయినప్పటికీ ఎన్నో రూమర్లు వినిపించాయి.ఎంగేజ్మెంట్ చెడిపోవడానికి కారణం ఆ హీరోనేనని,ఆ హీరోతో టబుకి ఉన్న రిలేషన్ వల్లే నిర్మాత సాజీద్ నదియావాలా ఎంగేజ్మెంట్ కాన్సల్ చేశారు అనే రూమర్లు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: