
ఇక ఇప్పుడు రష్మి గౌతమ్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ లలో యాంకర్ గా చేస్తుంది. కొన్ని సార్లు స్పెషల్ ఈవెంట్ లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కూడా నటిస్తుంది. కానీ ఆ సినిమాలు కూడా అంతగా హిట్ కొట్టలేదు. ఇక మనకి సినిమాలు సెట్ కావు అనుకుందో ఏమో.. కానీ రష్మి ఇప్పుడు పూర్తి ఫోకస్ బుల్లితెరపైనే పెట్టింది. ఇప్పుడు సుధీర్, రష్మి కలిసి యాంకరింగ్ చేయడం లేదు. అయినప్పటికీ వీరిద్దరి లవ్ ట్రాక్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
అయితే రష్మి గౌతమ్ ని, హీరో నితిన్ నటించిన జయం సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారట. రష్మి సినిమాలోకి కొన్ని సీన్స్ రిహార్సల్స్ కూడా చేసిందట. నితిన్ కూడా రొమాంటిక్ సీన్స్ అన్ని రష్మితోనే చేశాడట. కానీ ఏమైందో ఏమో రష్మిని తీసేసి.. సదాని హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఇలాంటి చాలా సినిమా ఆఫర్ లు రష్మికి రాకుండా పోయాయి అంట. అప్పుడు ఆ సినిమాలో చేసి ఉంటే, రష్మి ఇప్పటికీ మంచి స్టార్ అని ఉగాది ఈవెంట్ లో హీరో నితిన్ చెప్పుకొచ్చాడు.