ఒక స్టార్ హీరో సినిమా అంటే ప్రేక్షకులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను అందుకునే విషయంలో పూర్తిస్థాయిలో ఫెయిలైన సినిమా ఏదనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. ఈ సినిమా దిల్ రాజుకు పీడకల అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అకక్ర్లేదు.
 
ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ల జాబితాలో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్ లో నిలిచే ఛాన్స్ అయితే ఉంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్ ఫెయిల్యూర్ కాంబినేషన్ అని ఈ సినిమా ఫలితం మరోమారు ప్రూవ్ చేసింది. దిల్ రాజుకు గతంలో ఏ సినిమా షాకివ్వని స్థాయిలో ఈ సినిమా షాకిచ్చిందని చెప్పవచ్చు. చరణ్ ఇలాంటి కథను ఎంచుకోవడమే ఆయనకు మైనస్ అయిందని చెప్పవచ్చు.
 
గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో క్లీంకార పాజిటివ్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదనే సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు ఏవనే ప్రశ్నకు మగధీర, రంగస్థలం సినిమాల పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉండటం వల్లే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయని చెప్పవచ్చు. అయితే వరుస ఫ్లాపులు చరణ్ మార్కెట్ ను ఏ మాత్రం తగ్గించలేదు.
 
గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ అనిపించుకోకపోవడం అభిమానులను ఒకింత బాధ పెట్టింది. రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలతో అయినా సరికొత్త, సంచలన రికార్డులు క్రియేట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ రికార్డుల గేమ్ ఛేంజర్ అయిందనే సంగతి తెలిసిందే. స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. 2026 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: