ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు .సినిమా ఇండస్ట్రీలో అయితే టోటల్ పరిస్ధితి మారిపోయింది . ఎంతలా అంటే ఒకప్పుడు ఇష్టం వచ్చిన సీన్స్ తెరకెక్కించే విధంగా ఉండేది కాదు . ప్రతిదానికి లిమిట్స్ ప్రతిదానికి విధివిధానాలు విలువలు ఉండేటివి. ఎవరో చెప్తేనే కాదు ఒక డైరెక్టర్ సొంతంగా ఇలాంటి సీన్స్ చిత్రీకరించకూడదు . కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలి అంటే ఇలాంటి సీన్స్ ఉంటే పెద్దలు పిల్లలతో ఎలా చూస్తారు అనే విధంగా డైరెక్టర్ లే ఆలోచించి పిచ్చి పిచ్చి సీన్స్ షూట్ చేయకుండా ఆహ్లాదకరంగా ఎంటర్టైనింగ్ హెల్తీ రొమాంటిక్స్ సీన్స్ తెరకెక్కించేవాళ్లు.


అయితే ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం మారిపోయింది . ఎంతలా అంటే ఈ సినిమా చూస్తే ఎలాంటి బూతు పదాలు వాడాల్సి వస్తుందో అని భయపడిపోయేంత రేంజ్ లో రెచ్చిపోతున్నారు.  ఈ మధ్యకాలంలో సినిమాలో కథ కన్నా కూడా రొమాంటిక్ సన్నివేశాలు బూతు పదాలు ఎక్కువైపోతున్నాయి . అది అందరికీ తెలుసు . అయితే ఇకపై సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్ నటిస్తున్న .. చిన్న హీరో పెద్ద హీరో ఎవరైనా సరే ఎలాంటి డైరెక్టర్ అయినా సరే డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఎటువంటి సీన్స్ ఉండనే ఉండకూడదట.



అంతేకాదు మైనర్ గర్ల్స్ ని రేప్ చేసే సీన్స్  కూడా ఇకపై సినిమా ఇండస్ట్రీలో సినిమాలలో చూపించే విధంగా చేయకూడదట . సినీమండలి కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు జనాలని మంచి రూట్ లో తీసుకెళ్లే విధంగానే సినిమాలు ఉండాలి అని .. అలాంటి సినిమాలను తెరకెక్కిస్తేనే బాగుంటుంది అని.. ఇలా యువతను చెడు దోవ పట్టించే విధంగా ప్రేమ - దోమ - డ్రగ్స్ లేదా ఇలా రేప్ కంటెంట్ ని ఎంకరేజ్ చేసేలా చూపిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే విధంగా .. సినీ మండలి కొత్త రూల్ స్టార్ట్ చేయబోతుందట.  సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అఫ్కోర్స్ ఒకందుకు ఇది మంచి పని . ఎందుకంటే ఈ మధ్యకాలంలో యువత సినిమాలు చూసి ఎలా తప్పు దావపడుతున్నారో అందరికీ తెలుసు.  సినిమాలో ఏది చూపిస్తే అదే చేయాలి అనుకునే జనరేషన్ ఇది.  నిజంగానే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రూల్ వస్తే చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు అంటూ కామన్ పీపుల్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: