గత కొన్నేళ్లుగా నితిన్ ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. చాలామంది హీరోలతో పోల్చి చూస్తే నితిన్ సక్సెస్ రేట్ కొంతమేర తక్కువనే సంగతి తెలిసిందే. అటు నితిన్ ఇటు వెంకీ కుడుముల బాక్సాఫీస్ వద్ద రాబిన్ హుడ్ అనే సినిమాతో లక్ పరీక్షించుకోగా ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో పూర్తిస్థాయిలో ఫెయిలైందనే సంగతి తెలిసిందే.
 
రాబిన్ హుడ్ ఫలితం నితిన్ వెంకీ కుడుముల మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పవచ్చు. వెంకీ కుడుముల ఛలో, భీష్మ సినిమాలతో మంచి ఫలితాలను సొంతం చేసుకోగా రాబిన్ హుడ్ మాత్రం అంచనాలను అందుకోలేదు. రొటీన్ కథ, కథనంతో తెరకెక్కడం ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు. రాబిన్ హుడ్ సినిమాను రష్మిక రిజెక్ట్ చేసి మంచి పని చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రాబిన్ హుడ్ సినిమా మైత్రీ బ్యానర్ కు నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రాబిన్ హుడ్ సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నా ఆ ట్విస్టులు ఆశించిన స్థాయిలో పేలలేదనే సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ సినిమా ఫలితం నితిన్ ను తీవ్రస్థాయిలో నిరాశ పరిచిందనే సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.
 
రాబిన్ హుడ్ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడంతో పాటు ఈ సినిమాకు రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. అయితే శ్రీలీల కెరీర్ కు సైతం ఈ సినిమా మైనస్ అయింది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ సినిమా నితిన్ కెరీర్ కు మైనస్ అయిందని చెప్పవచ్చు. నితిన్ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: