టాలీవుడ్,బాలీవుడ్ , కోలీవుడ్లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ నిరంతరం జిమ్ వర్కౌట్లతో హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చాలామంది హీరోయిన్స్ ఇలా జిమ్ వర్కర్లు చేస్తూ గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా గడిచిన కొద్ది రోజుల క్రితం జిమ్ వర్కౌంట్లో చేస్తూ గాయపడింది. అయితే ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారుగా రకుల్ ప్రీతిసింగ్ కి ఆరు నెలలు పడుతుందని తెలియజేసింది.


ఈ విషయం విన్న అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ తాను ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోరుకుంటున్నానని.. 80 కిలోల బరువును డెత్ లిఫ్ట్ చేసే సమయంలో తన వెన్నుముకకు గాయమైందని ఆ గాయం తనని ఇప్పటికీ తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోందని తెలియజేసింది. ఈ గాయం కారణం వల్లే కొన్ని నెలల పాటు తాను బెడ్ రెస్ట్ లోనే ఉండవలసి వస్తుందని తెలిపింది. ఎవరైనా సరే శరీరం ఇచ్చే సంకేతాలు పట్టించుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది.


తాను చేసిన ఇలాంటి తప్పులను మరెవరు కూడా చేయవద్దంటూ తెలియజేస్తూ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహించాలి అంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగు ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. బాలీవుడ్ లో నిర్మాత జాకి భగ్న ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్కు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు చిత్రాలలో నటిస్తూ ఉన్న సరైన సక్సెస్ అందుకోలేదు.. అయినా కూడా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. రకుల్ ప్రీతిసింగ్. అభిమానులు మాత్రం తెలుగు ఇండస్ట్రీ లోకి రీయంట్రి ఇవ్వమని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: