టాలీవుడ్ నటుడు నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ ఈ మూవీ మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ ఎత్తున కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబట్టడంలో సక్సెస్ కాలేక పోతుంది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో భాగంగా నితిన్ మాట్లాడుతూ ... ఇప్పటికే తమ్ముడు మూవీ కి సంబంధించిన ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది అని , కేవలం ఒకే ఒక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అని , అది కూడా మరి కొన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అని , అలాగే రాబిన్ హుడ్ సినిమా విడుదల అయినా ఒకటి లేదా రెండు వారాలకు ఆ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేస్తాం అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని మే  9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో నితిన్ అభిమానులు తమ్ముడు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: