మన తెలుగు చిత్ర పరిశ్రమ లోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ .. గతంలో ఈయన దగ్గర నుంచి వచ్చే సినిమాలు కోసం ప్రేక్షకులు ఎంతో వెగబడి మరి ఎదురు చూసే వారు .. అలాంటి ఈ డేరింగ్ డైరెక్టర్ గత కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు .. ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమా కూడా మెప్పించలేకపోతున్నాయి .. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తర్వాత నుంచి పూరి జగన్నాథ్ కెరీర్ ఊహించిన విధంగా తయారైంది .. టెంపర్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ తప్పనిచ్చి ఏ సినిమా కూడా పూరి బ్రాండ్ సినిమాగా నిలలేకపోయింది ..


ఇక పూరి చివరగా తెరకెక్కిచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ నెగిటివ్ రివ్యూలు తెచ్చుకుని పూరికి మరింత డామేజ్ చేసింది .. ఇలాంటి సమయంలో పూరితో సినిమాలు చేయడానికి తెలుగులో ఉన్న స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అంద‌రు పూరి పేరు చెబితే ఆమడ‌ దూరం పారిపోతున్నారు .. ఇలాంటి క్రమంలో పూరి. ఇప్పటివరకు తన తర్వాత సినిమాని కూడా ఎవరితో చేస్తానని కూడా ప్రకటించలేదు .. ఇక‌ మొన్నటి వరకు గోపీచంద్ , నాగార్జున , అఖిల్ అనే పేర్లు కూడా పూరి సినిమా చేయబోతున్నట్టు వినిపించాయి .. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో విమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నట్టు వార్త బయటకు వచ్చింది .. ఇప్పటికే పూరివిజయ్ సేతుపతి కి కథ చెప్పాడని .  అందుకు విజయ్ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి .


అలాగే విజయ్ సేతుపతి సాధారణంగా ఆయన సినిమా ఓకే చేశాడంటే ఆ సినిమా లో ఏదో ఒక మంచి పాయింట్ ఉంటేనే విజయ్ సేతుపతి సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు .. అలాంటి విజయ్ సేతుపతి పూరి తో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు అనగానే ఆ సినిమా పై భారీ అంచ‌న‌లు ఏర్పడ్డాయి .  అలాగే విజయ్ సేతుపతి అంటేనే మినిమం గ్యారంటీ .  అలాంటి అగ్ర నటుని పూరి ఒప్పించారంటే ఈసారి కంటెంట్ సాలిడ్ గా ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు .. ఇక దీంతో ఇప్పుడు ఈ సినిమా తో పూరి కచ్చితంగా కంబ్యాక్  ఇస్తారని చాలామంది నమ్ముతున్నారు . అయితే ఈసారి పూరి ఎలాంటి సబ్జెక్టు తో రాబోతున్నాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: