యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితమే ఓ మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ షూటింగ్ ను ఎన్టీఆర్ - నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నాట్లు , ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ను కన్ఫామ్ చేయనున్నట్లు , మరికొన్ని రోజుల్లో ఈ టైటిల్ ను కన్ఫామ్ చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ప్రస్తుతం ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొన్ని రోజులే అవుతున్న ఈ మూవీ థియేటర్ హక్కులకి భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మివేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను నార్త్ అమెరికాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు వార్ 2 అనే హిందీ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: