యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా త్రిబుల్ ఆర్‌ తర్వాతహీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందు వచ్చి  బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసింది .. ప్రస్తుతం జపాన్ లో కూడా ఈ సినిమా కి భారీ క్రేజ్ కలెక్షన్లు కూడా వస్తున్నాయి .. ఇలా ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా కు కలెక్షన్లు నమోదయ్యాయి .  ఈ క్రమంలోనే ఈ దేవర సిక్వల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. అయితే ఇప్పుడు తాజా గా దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పై లేటెస్ట్ అప్డేట్ బయట కు వచ్చింది .. ఇప్పటి కే దర్శకుడు కొరటాల శివ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తుంది ..


అయితే ఏప్రిల్ నాలుగో వారం నుంచి మళ్లీ ఈ సినిమా కు సంబంధించిన సెకండ్ పార్ట్ పై స్క్రిప్ట్ పనుల్లో కూర్చోబోతున్నాడట .. ప్రధానంగా స్క్రీన్ ప్లే కీలక సన్నివేశాలను ఎంతో ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ తన టీం తో వర్క్ చేస్తున్నారట .. అలాగే పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నార ని కూడా తెలుస్తుంది .. అలాగే ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని రూమర్లు కూడా వస్తున్నాయి .


ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు .. బాలీవుడ్ స్టార్ సైఫాలీ ఖాన్ విలన్ గా నటించారు . మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీత అందించాడు . అలాగే ఈ సినిమా లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , అజయ్ మురళీ శర్మ వంటి వారి కీలక పాత్ర లో నటించిగా దేవర 2 లో కూడా వీరు పాత్రలు ఎంతో కీలకంగా ఉండబోతున్నాయని కూడా అంటున్నారు .. అలాగే దేవర 2 లో దేవర కథ ఎక్కువగా ఉంటుందని పైగా కథలో చాలా డెప్త్ కూడా ఉండబోతుందని కూడా తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: