నట‌సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేష న్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీ దగ్గర ఏ స్థాయి లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ సినిమా కి సిక్వల్ గా అఖండ 2 తాండవం పై కూడా అదే స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి .. అయితే ఇప్పుడు వచ్చే వారం నుంచి ఈ సినిమా కు సంబంధించిన ఓ ప్రత్యేక సెట్ లో బాలయ్య పై ప‌లు కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించబోతున్నారట .. అందు కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ ప్రత్యేక సెట్ ను కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది .


అలాగే ఈ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్షన్ కూడా షూట్ చేస్తారని కూడా తెలుస్తుంది .. ఇలా సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు ఎంతో మేన్ హైలైట్ గా ఉంటాయని కూడా తెలుస్తుంది .. ఈ సినిమా ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మిస్తున్నారు .. తమన్సినిమా కు సంగీతం అందిస్తున్నారు .. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ ఇప్పటికే నమోదయ్యాయి .. దీంతో అఖండ 2 తాండవం పై ఊహించిన రేంజ్ లో అంచనాలు ఉన్నాయి . అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయి లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ..


సెప్టెంబర్ 28 న అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. ఇక మరి ఈసారి బాలయ్య తో బోయపాటి ఎలాంటి సంచనాల క్రియేట్ చేయబోతున్నారని సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే .. అలాగే బాలయ్య కూడా  వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.. ఇప్పటికే ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ తో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య .. అఖండ 2 తో ఈసారి ఇండియన్ సినిమా దగ్గర ఊహించని సంచనాల క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: