తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శర్వానంద్ ఒకరు. ఈయన ఇప్పటికే చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఆఖరుగా శర్వానంద్ "మనమే" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ "నారి నారి నడుమ మురారి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా నుండి దర్శనమే అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు  ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ నుండి విడుదల చేసే మొదటి సాంగ్ కి గనుక మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చినట్లయితే ఈ మూవీ పై కూడా జనాల్లో అంచనాలు పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరి ఈ మూవీ లోని మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే శర్వానంద్ మరి కొంత కాలం లోనే సంపత్ నంది దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ లో శర్వానంద్ అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ , సంపత్ నంది కాంబో మూవీ కి సంబంధించిన అనేక విషయాలు మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: