సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కి ఒక టఫ్ పరిస్థితి వస్తూ ఉంటుంది . ఆ సిచువేషన్ ఫేస్ చేసి సమర్థవంతంగా కెరియర్ ని ముందుకు తీసుకెళ్తే ఇక నో డౌట్ .. ఆ హీరోయిన్ తోపైన హీరోయిన్గా మారిపోతుంది . కానీ కొంతమంది అలాంటి టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి చాలా చాలా టైం తీసుకుంటారు . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ హనీ రోజ్ పేరు మరొకసారి బాగా ట్రెండింగ్  లోకి వచ్చింది . హనీ రోజ్  ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ అయ్యే టువంటి టాలెంట్ ఉన్న బ్యూటీ .


నందమూరీ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఆమె పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది. "మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి" అంటూ అల్లాడించేసింది . అయితే ఆ తర్వాత చెప్పుకోతగ్గ క్యారెక్టర్ లో ఎక్కడ కనిపించలేదు హనీ రోజ్.  అదృష్టం ఆమెను మళ్ళీ బాలయ్య రూపంలోనే వరించింది . బాలయ్య నటిస్తున్న "అఖండ 2"  సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట.  బోయపాటి శ్రీను ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.  హనీ రోజు ఈ మధ్యకాలంలో చాలా కాంట్రవర్షియల్  మాటల్లో ఇరుక్కునింది .



అలాంటి బ్యూటీకి టాలీవుడ్ నుంచి ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు . చాలా మంది హనీ రోజ్ మా మూవీ లో వద్దు అంటూ కూడా రిజెక్ట్ చేశారు అనే మాటలు వినిపించాయి. కానీ బాలయ్య మాత్రం టాలెంట్ ని బాగా నమ్మాడు.  ఆ కారణంగానే అఖండ టు లో స్పెషల్ సాంగ్ కోసం ఆమె పేరుని సజెస్ట్ చేశారు . బోయపాటికి కూడా బాలయ్య చెప్పిన దానికి ఓకే అన్నారు . ఇంకేముంది త్వరలోనే ఈ సాంగ్ కి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించబోతున్నారట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: