టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా రూపొందిన డాన్ శీను అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే గోపీచంద్ మలినేని ఆఖరుగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా రూపొందుతున్న జాట్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లోని టచ్ కియ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే గోపీచంద్ మలినేని "జాట్" మూవీ ని అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించినట్లు ఈ మూవీ ప్రచార చిత్రాలను బట్టి అర్థం అవుతుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే గోపీచంద్ మలినేనికి హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: