టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చ్ 28 ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ  మ్యాడ్ కు సీక్వల్ గా వచ్చిన మ్యాడ్‌ స్క్వేర్ పై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి .. ట్రైలర్ , ట్రీజర్ , పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమా పై అంచనాలు మరింత పెంచేసాయి .. ప్రధానం గా టీజర్ అందులోని సంభాషణలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారాయి .  ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ పై అంచనాలు మరో స్థాయి కి చేరుకున్నాయి .. దాంతో ఈ సినిమాపై  మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి .. 


ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది థియేటర్స్ లో ప్రేక్షకులు పగలబడి మరి సినిమా చూసి నవ్వుతున్నారు . ప్రధానంగా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా థియేటర్లో నవ్వుల వర్షం కురిపించింది . దర్శకుడు కళ్యాణ్ శంకర్ సీక్వల్ తో మరోసారి నవ్వుల విందుని ప్రేక్షకులకు అందించాడు . సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్ , సంగీత్ శోభన్ , రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించి ఈ సినిమాలో ఆకట్టుకున్నారు .. అయితే ఇప్పుడు   మ్యాడ్ స్క్వేర్  బాక్స్ ఆఫీస్ దగ్గర మరో రికార్డును అందుకుంది .. ఇక సినిమా కు మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంటుంది ఉగాది రోజున కూడా మంచి కలెక్షన్లు ఈ సినిమా అందుకుంది ..
 

ఇక ఇప్పుడు ఓవర్సీస్‌లో  కూడా మ్యాడ్ స్క్వేర్ తన సత్తా చాటుకుంటుంది . ఇప్పటి కే అక్కడ వన్ మిలియన్ డాలర్ ను క్రాస్‌ చేసింది ఈ సినిమా .  ఇలా మ్యాడ్ స్క్వేర్ మూడు రోజుల్లోనే 55.2 కోట్ల గ్రాస్ ను  వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది . మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.  ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచుతుంది మ్యాడ్ స్క్వేర్.



మరింత సమాచారం తెలుసుకోండి: