మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని రోజుల్లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న అనగా మార్చి 30 వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందబోయే సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అనిల్ రావిపూడి , చిరు నెక్స్ట్ మూవీ విషయంలో వాల్టేర్ వీరయ్య సినిమా ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... చిరంజీవి కొంత కాలం క్రితం బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి కి తమ్ముడి పాత్రలో రవితేజ నటించాడు. ఇక ఈ మూవీ లో చిరంజీవి , రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే దాదాపు ఇదే ఫార్ములాను చిరంజీవి నెక్స్ట్ సినిమా విషయంలో అనిల్ రావిపూడి ఫాలో కాబోతున్నట్టు తెలుస్తుంది.

చిరంజీవితో అనిల్ రూపొందించబోయే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో వెంకటేష్ నటించబోతున్నట్లు ,  వెంకటేష్ పాత్ర ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో రానున్నట్లు , వెంకటేష్ పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువ గానే ఉన్నా కూడా సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగానే చిరంజీవి , వెంకటేష్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాల్లో నటించినట్లయితే ఈ మూవీ పై అంచనాలు తార స్థాయికి చేరుతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: