టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకుంటూ ఉండగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి బాలయ్య కొన్ని తప్పులు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా వాయిదా పడింది. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమా అయినా సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాల్సి ఉంది. బాలయ్య మోక్శజ్ఞపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
 
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టు మోక్షజ్ఞ కూడా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. మోక్షజ్ఞ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియలో హాట్ టాపిక్ అవుతోంది.
 
ఏపీలో కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. బాలయ్య సైతం యాక్షన్ సినిమాలతో పాటు నవ్యత ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. బాలయ్య కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. మోక్షజ్ఞ మీడియాకు దూరంగా ఉండటం కూడా ఈ గందరగోళానికి ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. మోక్షజ్ఞ స్టార్ హీరోగా ఎదుగుతారో లేదో చూడాల్సి ఉంది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: