సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలు అందుకున్న వారికి మంచి సినిమా అవకాశాలు లభించడం , వారికి అద్భుతమైన క్రేజ్ దక్కడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఓ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో కేవలం ఒకే ఒక సినిమాలో నటించింది. నటించిన ఆ ఒక్క సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ మూవీలో ఆ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఒక్క మూవీతోనే అద్భుతమైన గుర్తింపును ఆ నటి తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అతుల్య రవి. ఈ ముద్దుగుమ్మ 2017 వ  సంవత్సరం కాదల్ కన్ కట్టుధే అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ యెమాలి ,  నాడోడిగల్ 2 అనే మూవీలలో నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం కిరణ్ అబ్బవరం హీరో గా రూపొందిన మీటర్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీబిలోకి ఎంట్రీ ఇచ్చింది. 2023 వ సంవత్సరం విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఈ మూవీ తర్వాత మాత్రం ఈమెకు ఏ తెలుగు సినిమాలో అవకాశం రాలేదు. మరి తెలుగులో ఈమెకు మంచి క్రేజ్ ఉన్నా కూడా తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఈమెకు నిజం గానే టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడం లేదా ..? లేక ఈమె ఖచ్చితంగా నెక్స్ట్ నటించే తెలుగు సినిమాతో హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో మూవీలను రిజెక్ట్ చేస్తుందా అనే అనుమానాలను కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: