మలయాళ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ కొన్ని సంవత్సరాల క్రితం నటుడు మరియు దర్శకుడు అయినటువంటి పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన లూసిఫర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా లూసిఫర్ మూవీ కి కొనసాగింపుగా పృథ్వీరాజ్ సుకుమరన్ , మోహన్ లాల్ హీరో గా ఎంపురాన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీనే తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయినా కూడా ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రాలేదు. దానితో ప్రస్తుతం ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు దక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

3 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 68 లక్షల కలెక్షన్లు దక్కగా , మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 52 లక్షల కలెక్షన్లు దక్కాయి. దానితో మొత్తంగా ఈ సినిమాకు 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.20 లక్షల షేర్ ... 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 4.80 కోట్ల షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: