తాజాగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటి వరకు రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. మరి మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో విడుదలైన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవి ..? అందులో మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎన్ని కోట్లతో ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.42 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత 2 వ స్థానంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ 7.36 కోట్ల కలెక్షన్లతో కొనసాగుతూ ఉండగా , ఆ తర్వాత ఉప్పెన మూవీ 6.86 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , దసరా సినిమా 5.86 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , విరూపాక్ష సినిమా 5.80 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , ఖుషి సినిమా 5.36 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానం లోనూ , లవ్ స్టోరీ సినిమా 5.08 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , మజిలీ మూవీ 4.98 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది. ఇక తాజాగా విడుదల అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.84 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 9 వ స్థానంలో కొనసాగుతుంది. ఇక అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 4.51 కోట్ల కలెక్షన్లతో 10 వ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: