టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు పొందిన పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాపులను ఎదుర్కొంటున్నారు. దీంతో డైరెక్టర్ పూరి తో సినిమా చేయాలంటే చాలా మంది నిర్మాతలు హీరోలు సైతం భయపడుతున్నారు. అంతేకాకుండా అటు పూరి జగన్నాథ్ ,ఛార్మి కౌర్ కూడా ఇద్దరు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు. 2015లో విడుదలైన జ్యోతిలక్ష్మి సినిమా నుంచి వీరిద్దరూ ప్రొడక్షన్ హౌస్ ని మొదలుపెట్టి అప్పటినుంచి పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాణ సంస్థలోకి అడుగు పెట్టింది.

పూరి కనెక్ట్ అనే బాధ్యతలను సైతం తన భుజాన వేసుకొని ముందుకు వెళ్తుంది ఛార్మి. సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ కూడా ఇలా తనదైన నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి సందర్భంలోనే అటు పూరి, ఛార్మి మధ్య ఏవేవో రూమర్స్ కూడా వినిపించాయి. ఎన్నో సందర్భాలలో అటు పూరి, ఛార్మి మధ్య వ్యవహారాలను కూడా వీరిద్దరూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొంతకాలం పరాజయాలు మూటకట్టుకున్నప్పటికీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అన్నిటిని పటాపంచలు చేశారు.


ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తీయగా ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పూరి, ఛార్మి. ఈ చిత్రం తర్వాత వెంటనే విజయ్ దేవరకొండ తో జనగణమన అనే సినిమాను కూడా మొదలుపెట్టగా ఇది ఆగిపోయింది. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ శంకర్  సినిమా తీయగా ఇది కూడా డిజాస్టర్ గా మారింది.. దీంతో  అటు పూరి, ఛార్మి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి సమయంలోనే నిన్నటి రోజున ఒక కొత్త సినిమా ప్రకటనతో మరొకసారి రూమర్స్ కి చెక్ పెట్టారు.


హీరో విజయ్ సేతుపతి తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించిన నిన్నటి రోజున దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో అయినా మళ్ళీ పూరి ఛార్మి కం బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: