శ్రీదేవి.. ఈ పేరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం "కోర్టు" మూవీ అని చెప్పక తప్పదు . ఎటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా లోటు బడ్జెట్లో చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది . ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు.  సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కు ప్రత్యేకమైన పేరు తీసుకొచ్చింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లో నటించిన శ్రీదేవి అద్దిరిపోయే రేంజ్ లో ప్రశంసలు దక్కించుకుంది .


మరీ ముఖ్యంగా ప్రియదర్శి - హర్ష రోషన్ - శివాజీసినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . అలాగే తమ పేరుకి ఇంకా హైలైట్ అయ్యే విధంగా కామెంట్స్ దక్కించుకున్నారు . కాగా  ఈ సినిమా ద్వారా ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది ఎవరు అంటే మాత్రం శ్రీదేవి అని చెప్పాలి . ఇప్పుడు శ్రీదేవికి బోలెడన్ని ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయట. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆమె ఖాతాలో ఒక బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాలో కీలక పాత్రలో శ్రీదేవిని చూస్ చేసుకున్నారట .



చిరంజీవి కూతురుగా శ్రీదేవి సినిమాలో కనిపించబోతుందట . ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆధారంగా తెరకెక్కుతుంది అని .. కుటుంబ విధివిధానాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు అని..  మరీ ముఖ్యంగా శ్రీదేవి రోల్ ఈ సినిమాలో చాలా చాలా కీలకంగా మారిపోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . చిన్న స్టార్స్ తో కాదు పెద్ద పెద్ద స్టార్ ల  చేతుల్లో పడితే శ్రీదేవి నేషనల్ క్రష్ లాంటి హీరోయిన్ అయిపోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: