ఇక బాలకృష్ణ ఆదిత్య 369 కు సీక్వల్ తీస్తాన ని ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాడు బాలయ్య .. అయితే ఇది ఇప్పటి వరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదు .. అయితే ఇప్పుడు తాజా గా మరోసారి సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు . .. కానీ క్లారిటీ రాలేదు .. ఆయన ఎప్పుడు తీస్తారో ఆయనకే తెలియదు .. కానీ ఇప్పుడు తీస్తే మాత్రం ఇదే సరైన సమయం అంటున్నారు నందమూరి అభిమానులు .. ఐదేళ్ల కిందట పరిస్థితి వేరు ఇప్పుడు వేరు సీక్వెల్స్ కు పూర్తి అనుకూలంగా వాతావరణం మారిపోయింది . కాబట్టి ఆదిత్య 369 సీక్వెల్ చేయాలంటే ఇదే సరైన సమయం ..


ఇక బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా ను మొదలు పెట్టాలని కూడా ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు .. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా ఆ మాట ను దాటేశారు .. ఆదిత్య 369 సీక్వల్ కథను ఒక రాత్రుల్లో పూర్తి చేశాని ప్రకటించిన ఈ అగ్ర నటుడు క‌థ‌ బాగా వచ్చిందని ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అని ఆత్రుతగా ఉంన్నాన‌ని మాత్రమే చెప్పారు .. కానీ అంతకుమించి ఇంకేం అభిమానులకు చెప్పలేదు . ఇక ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ కూడా బాలయ్య స్వయంగా గతంలో ప్రకటించారు .


అలాగే తానే ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తా ని ఒక దశలో ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు . కొడుకు మోక్షజ్ఞ ఇందులో నటించే అవకాశం ఉందంటూ పలు వార్తలు కూడా వచ్చాయి .  కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇంకా ముందుకు వెళ్ళటం లేదు . ఇలా గత ఆరు సంవత్సరాలగా నలుగుతున్న ఈ ప్రాజెక్టును పట్టాల పైకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అంటున్నారు అభిమానులు . ఇక ఈ సంవత్సరం అయినా బాలయ్య ఈ సీక్వల్ మొదలు పెడతారేమో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: